Header Banner

రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీఎస్ కార్యాలయాలు ఏర్పాటు! ఆ 26 జిల్లాల్లో వారికి ఇక పండగే.!

  Fri May 16, 2025 21:37        Politics

రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఏపీటీఎస్ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ వెల్లడించారు. ప్రతి జిల్లా కార్యాలయం ఒక జిల్లా ఐటీ మేనేజర్ నేతృత్వంలో ముగ్గురు అసిస్టెంట్ మేనేజర్లతో పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ- ప్రొక్యూర్మెంట్ ద్వారా 55,486 టెండర్లు ప్రచురించగా.. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ రూ.41వేల కోట్లు కంటే అధికమేనన్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ప్రొక్యూర్మెంట్ సేవల ద్వారా రూ.110 కోట్లకు పైగా కొనుగోలు లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ లక్ష్యం దాదాపు రూ.600 కోట్లు అన్నారు. సైబర్ సెక్యూరిటీ సేవలను మరింతగా విస్తృత పరుస్తున్నామన్న ఆయన.. గత ప్రభుత్వ హయాంలో కన్నా ఏపీటీఎస్ ఇప్పుడు మెరుగైన సేవలందిస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఐటీ మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో ఏపీటీఎస్ బహుముఖ కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ పాలనను ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తోందని మన్నవ మోహన కృష్ణ తెలిపారు. సైబర్ సెక్యూరిటీని మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో టెక్నాలజీ సర్వీసులను మరింత విస్తృత పరిచి ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేందుకు ఏపీటీఎస్ కట్టుబడి ఉందన్నారు.

 

ఇది కూడా చదవండి: బెజవాడలో భారీ తిరంగా ర్యాలీ.. పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి!

 

గతేడాది జులై నుంచి 2025 ఏప్రిల్ వరకు ఏపీటీఎస్ గణనీయమైన విజయాలతో అనేక ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టిందన్నారు. భవిష్యత్తు విస్తరణ కోసం ఒక ప్రణాళికను సైతం రూపొందించిందని తెలిపారు. ఏపీఈఎస్ 19.39 కోట్ల ఆధార్ ఆధారిత లావాదేవీలు, 5.98 కోట్ల ఈ-కైవేసీ లావాదేవీలు నిర్వహించిందని వివరించారు. డిజిటల్ గవర్నెన్స్ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాలకు ఈ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నామన్న ఆయన.. ఇప్పటివరకు 19,500 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. రాబోయే కాలంలో ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలోని కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, హెల్త్కేర్, టెలికాం వంటి రంగాల్లో చేయబోతున్నట్లు మోహనకృష్ణ తెలిపారు. అలాగే, పక్క రాష్ట్రాల్లోనూ సెక్యూరిటీ ఆడిట్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వెబ్ అప్లికేషన్లు, మొబైల్ అప్లికేషన్ల కోసం సెక్యూరిటీ ఆడిట్లు, రెడ్ టీం ఆడిట్లు కలిపి 650కి పైగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ విభాగాలకు సైబర్ సెక్యూరిటీ ముప్పురాకుండా నిరంతరం పర్యవేక్షించే ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్ (APCSOC) దేశంలోనే అత్యుత్తమ కేంద్రంగా గుర్తింపు పొందిందన్నారు. ఏపీసీఎస్ఓసీ 24/7 పర్యవేక్షించడంతో పాటు సైబర్ ముప్పు గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం దాదాపు 30వేల ఈవెంట్స్ ఫర్ సెకండ్ ట్రాఫిక్ను పర్యవేక్షిస్తుందన్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations